ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్పీ బాలు మృతి కళా, సాంస్కృతిక రంగానికి తీరని లోటు: సీఎం జగన్ - ఎస్పీ బాలు కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణం మృతికి సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు కుటుంబసభ్యులను ఫోన్​లో పరామర్శించిన సీఎం జగన్​... వారికి ధైర్యం చెప్పారు.

ఎస్పీ బాలు
ఎస్పీ బాలు

By

Published : Sep 25, 2020, 4:39 PM IST

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు కుటుంబసభ్యులను సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్​కు ఫోన్ చేసిన సీఎం జగన్.. వారితో మాట్లాడారు. ఎస్పీ బాలు మరణం కళా, సాంస్కృతిక రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ధైర్యంగా ఉండాలని... కుటుంబసభ్యులందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details