సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే.. బోధనాసుపత్రుల నిర్మాణానికి సంబంధించి జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనను మరోమారు ప్రస్తావించారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయా? సీఎం జగన్ ఏమన్నారు?
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అయ్యే అవకాశం ఉందా? పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు కానున్నాయా? కలెక్టర్ల్, ఎస్పీలతో జరిగిన సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం ఏం చెప్పారు?
రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నందున దానికి అనుగుణంగా బోధనాసుపత్రులు నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి జిల్లాలోనూ బోధనాసుపత్రి ఒకటి ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ముఖ్యమంత్రి అధికారులతో వ్యాఖ్యానించారు. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన స్థలాలను సేకరించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 మాత్రమే బోధనాసుపత్రులు ఉన్నాయని.. కొత్తగా మరో 16 నిర్మించబోతున్నట్టు సీఎం వెల్లడించారు. దీనికి అదనంగా కర్నూలు జిల్లా ఆదోనిలోనూ మరో బోధనాసుపత్రిని నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:జులై 8న ఉచిత ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ: సీఎం జగన్