అధికారులు లంచం తీసుకుంటూ దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ‘దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని నిర్ణయించారు. 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి అంశాలు అనిశాకు చెందిన 14400కు బదలాయింపు చేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా అనుసంధానం చేయాలని ఆదేశించారు.
'ఎమ్మార్వో, ఎండీఓ, సబ్‌రిజిష్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలి. టెండర్ విలువ రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాల్సిందే'- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి