ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు: సీఎం జగన్​ - chandrababu didnt done anything for kuppam

Pension will be increased: మహిళా సాధికారతే లక్ష్యంగా 39 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో విడత చేయూత నిధులను విడుదల చేసిన సీఎం జగన్​... 26 లక్షల 39వేల మంది ఖాతాల్లో 4వేల 949 కోట్ల నిధులు వేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శలు గుర్పించారు. మరో 6 నెలల్లో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పూర్తి చేసి నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు.

cm jagan
సీఎం జగన్​

By

Published : Sep 23, 2022, 2:55 PM IST

Updated : Sep 23, 2022, 6:56 PM IST

Pension will be increased:'వైఎస్సార్​ చేయూత' ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని... ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఆయన... ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలు సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు మూడో విడత కింద 26 లక్షల 39వేల మంది మహిళల ఖాతాల్లో 4వేల 949 కోట్ల నిధులను జమ చేశారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి... ప్రభుత్వం చేపట్టిన 31 లక్షల ఇళ్లు పూర్తయితే ప్రతి మహిళ చేతిలో 10 లక్షలు ఉన్నట్లేనని అన్నారు. వచ్చే జనవరి నుంచి వృద్ధ్యాప్య పింఛన్లు 2వేల 750 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్‌

"వచ్చే జనవరి నుంచి పింఛను రూ.2,750 కు పెంపు. మాది మహిళల ప్రభుత్వం.. వారి జీవితాల్లో మార్పు వస్తోంది. అమ్మఒడి ద్వారా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచాం. 4 పథకాల ద్వారా మహిళలకు రూ.51 వేల కోట్లు ఇచ్చాం. మూడేళ్లలో మహిళలకు రూ.లక్షా 17 వేల కోట్లు అందించాం. నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వ సాయం. ఎక్కడా లంచాలు లేవు.. మధ్యవర్తులు లేరు.. వివక్ష లేదు."-సీఎం జగన్​

CM Jagan comments on Chandrababu: ‘‘దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇవే గత ప్రభుత్వ నినాదాలన్న ముఖ్యమంత్రి.... ఏడు విడతలుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు... నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. కుప్పంలో సొంతిల్లు కూడా కట్టుకోని చంద్రబాబు.. నియోజకవర్గానికి ఏదో చేసినట్లు మాటలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కరవు సమస్యకు హంద్రీనీవా పరిష్కారమని తెలిసినా పూర్తి చేయలేదన్నారు. మరో 6 నెలల్లో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు నీళ్లిస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో వైకాపా నేత భరత్​ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు.

అటు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కుప్పాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. పట్టణ సమీపంలోని హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రోడ్డుపై తవ్వి మరీ బారికేడ్లు పెట్టారు. దీనివల్ల రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సీఎం రావడానికి 3 గంటల ముందునుంచే ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆపేశారు. జనం వచ్చే దారిలేక రెండు రోజులుగా అమ్మకాలు సాగలేదని దుకాణదారులు వాపోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 23, 2022, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details