రాజధాని అమరావతి ఉద్యమంపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. బీసీ సంక్రాంతి కార్యక్రమంలో మాట్లాడిన జగన్... తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం చేపట్టే కార్యక్రమానికి ఎక్కడ ప్రాముఖ్యత లభిస్తుందో అని దురుద్దేశంతోనే పోటీగా సభ పెట్టారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు రాయపూడిలో ఉద్యమం చేయిస్తున్నారని విమర్శించారు.
అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్ - అమరావతి ఉద్యమం తాజా వార్తలు
బీసీ సంక్రాంతి కార్యక్రమంలో సీఎం జగన్ అమరావతి ఉద్యమంపై స్పందించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసిన భూముల ధరలు పడిపోతాయేమోనన్న భయంతో చంద్రబాబు ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు.
![అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్ cm jagan comments on amaravathi janbheri movement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9909415-574-9909415-1608197690819.jpg)
అమరావతి ఉద్యమంపై తొలిసారిగా స్పందించిన సీఎం జగన్
అమరావతి ఉద్యమంపై తొలిసారిగా స్పందించిన సీఎం జగన్
అధికారంలో ఉన్నప్పుడు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన భూముల ధరలు పడిపోతాయనే భయంతోనే చంద్రబాబు ఈ ఉద్యమానికి తెరతీశారని జగన్ ఆరోపించారు. అది ఓడిన పాలకుడు చేస్తున్న ఉద్యమమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!
Last Updated : Dec 17, 2020, 4:26 PM IST