ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులపై ఒక్క పైసా భారం పడబోదు: సీఎం జగన్ - ఏపీలో పవర్ వార్

ప్రస్తుత సంస్కరణలతో రైతులపై ఒక్క పైసా భారం పడబోదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. రైతులకు అందే విద్యుత్ ఎప్పుడూ ఉచితమేనన్నారు. ఒక్క కనెన్షన్ తొలగించమన్న ఆయన...ఉన్న కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.

cm jagan
cm jagan

By

Published : Sep 4, 2020, 3:19 AM IST

రైతులకు అందే విద్యుత్ ఎప్పుడూ ఉచితమే... ఒక్క కనెక్షన్ కూడా తొలగించం. ఉన్న కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. గురువారం మంత్రిమండలి సమావేశంలో సీఎం మంత్రులతో మాట్లాడుతూ... మీటర్ల ఖర్చు డిస్కమ్​లది, ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రస్తుత సంస్కరణలతో రైతులపై ఒక్క పైసా భారం పడబోదని అన్నారు. వచ్చే 30-35 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చేస్తున్నామని వెల్లడించారు.

'ఉచిత విద్యుత్​పై పేటెంట్ వైఎస్సార్​కే ఉంది. అందుకే ఆయన పేరుతోనే ఈ పథకం అమలు చేస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చాయి. పగటిపూట 9 గంటల విద్యుత్తు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఉచిత విద్యుత్తు పథకానికి ఢోకా లేకుండా యూనిట్ రూ.2.50కే వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచిత విద్యుత్తుకు ఏడాదికి ఒక్కో రైతుకు రూ. 49,600 చొప్పున మొత్తం రూ.8000కోట్లు ఖర్చవుతుంది' - ముఖ్యమంత్రి జగన్

బస్సులపై దృష్టి పెట్టండి: సీఎం

తెలంగాణకు ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పేర్నినానికి సీఎం సూచించారు.

ఇదీ చదవండి

టిక్​టాక్​తో ఒక్కటయ్యారు.. ఒక్కటిగా తనువు చాలించారు!

ABOUT THE AUTHOR

...view details