అక్రమాస్తుల కేసులో తన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై కౌంటరు దాఖలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గడువు కోరారు. కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ కూడా సమయం కావాలని కోరింది. షరతులు ఉల్లంఘించినందుకు.. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్ ఇవాళ సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. జగన్, సీబీఐ గడువు కోరడంపై రఘురామకృష్ణ రాజు తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పందించిన న్యాయస్థానం కౌంటరు దాఖలుకు చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేస్తూ విచారణ ఈనెల 26కి వాయిదా వేసింది. రఘురామ కృష్ణరాజుపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్న విషయం కూడా సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని న్యాయవాది ఎస్. శ్రీవెంకటేష్ తెలిపారు.
బెయిల్ రద్దు పిటిషన్పై కౌంటర్ దాఖలుకు గడువు కోరిన జగన్ తరఫు న్యాయవాది
అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై కౌంటరు దాఖలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గడువు కోరారు.
cm jagan