వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే తనకు వారసత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో తాను వైఎస్ఆర్ ను చూస్తున్నానని అన్నారు. పాలనలో ప్రతి క్షణం వైఎస్ అడుగు జాడను స్మరిస్తూనే ఉన్నానన్నారు. వైఎస్ఆర్ 72 వ జయంతి సందర్భంగా తన తండ్రిని గుర్తు తెచ్చుకున్న సీఎం వైఎస్ జగన్ .... ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చెదరని చిరునవ్వు వైఎస్ఆర్ పంచిన ఆయుధమని తెలిపిన సీఎం.... పోరాడే గుణమే ఆయన ఇచ్చిన బలమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
CM JAGAN: 'చిరునవ్వు ఆయన పంచిన ఆయుధం... పోరాడే గుణం ఆయన ఇచ్చిన బలం' - వైఎస్ రాజశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జగన్
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే తనకు వారసత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో తాను వైఎస్ఆర్ ను చూస్తున్నానని అన్నారు. తండ్రి వైఎస్ఆర్కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
![CM JAGAN: 'చిరునవ్వు ఆయన పంచిన ఆయుధం... పోరాడే గుణం ఆయన ఇచ్చిన బలం' వైఎస్ జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12393015-530-12393015-1625730380302.jpg)
వైఎస్ జగన్