ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్బంగా ఏర్పాటైన కమిటీతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు, ఆథ్యాత్మిక వేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్ అత్యంత ప్రశసంసనీయమైనదని సీఎం వైఎస్ జగన్ ప్రసంసించారు. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, శాస్త్రసాంకేతిక రంగాల్లో గడచిన 75 సంవత్సరాల్లో దేశం సాధించిన ప్రగతిని గుర్తుచేసుకోవడానికి, ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి మన అంకితభావాన్ని పునరుద్ఘాటించడానికి అమృత్ మహోత్సవ్ వేదిక కల్పిస్తోందన్నారు. స్వతంత్ర పోరాటయోధుల నిస్వార్థతను చూసి మనమంతా గర్వించాలన్నారు. అమృత్ మహోత్సవ్ సందర్భంగా వారిని గౌరవించుకోవాలని, వారికి సెల్యూట్ చేయాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాష్ట్రంలో స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించుకునే అవకాశం తనకు కలిగిందన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య కుమార్తె శ్రీమతి సీతా మహాలక్ష్మిని వారి స్వగ్రామంలో కలుసుకున్నట్లు తెలిపారు.. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య .. 1921లో ఆయన తాను రూపొందించిన పతాకాన్ని మహాత్మగాంధీకి విజయవాడలో సమర్పించారని సీఎం తెలిపారు.. ప్రస్తుతం ఇది బాపు మ్యూజియంలో ఉందని.. ఈ మ్యూజియంను రాష్ట్ర ప్రభుత్వం బాగుచేసి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.
cm jagan in video conference : ఆర్థిక అసమానతలను తొలగించాలి - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
సుస్థిర ప్రగతి, ఆర్థిక అసమానతల తొలగింపు అంశాలే దేశానికి ప్రధాన లక్ష్యాలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. భవిష్యత్తు తరాలు వారి అవసరాలను తీర్చుకునేందుకు ఇబ్బందులు పడకూడదని, ఇంధన రంగంలో సమూల మార్పులు రావాలని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశంలో సీఎం పిలుపునిచ్చారు. సంపూర్ణంగా క్లీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేయాలన్న సీఎం ఒన్ సన్.. ఒన్ వరల్డ్... ఒన్ గ్రిడ్ కల సాకారం కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల సేవలను గుర్తుచేసుకుంటూ ప్రతీ వారం వర్చువల్‌గా, భౌతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ఇప్పటి వరకూ 908 కార్యక్రమాలు నిర్వహించామని, నిస్వార్థపరులైన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకోవడమే కాకుండా వారి జీవితాలనుంచి ఈ తరం యువకులు స్ఫూర్తిని పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడంద్వారా వారిలో దేశభక్తిని నింపుతున్నామని సీఎం తెలిపారు
గడిచిన 75 సంవత్సరాల్లో, ముఖ్యంగా ఈ ఏడున్నర సంవత్సరాల్లో ఈ దేశం చాలా ప్రగతిని సాధించిందన్న సీఎం.. రియల్ జీడీపీ 1950–51లో 2.94 లక్షల కోట్లు ఉంటే, 2019–20 నాటికి 145.69 లక్షల కోట్లుకు చేరుకుందన్నారు.. తద్వారా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్న మార్గంలో అనేక అవకాశాలూ ఉన్నాయని, అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. మన దేశ సమర్థతను చాటడానికి రెండు ప్రధాన అంశాల మీద దృష్టిపెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సుస్థిర ప్రగతి , ఆర్థిక అసమానతలను తొలగించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాయు కాలుష్యం పెరుగుతోదన్న సీఎం.. ఇది భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరమన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తొలగించి ఆ స్థానంలో సహజ వనరులనుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత ఉందన్నారు. సహజ వనరులనుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను స్టోరేజ్ చేసుకునే విషయంలో పరిష్కారాలను సత్వరం సాధించాల్సి ఉందన్నారు. కార్బన్ న్యూట్రాలిటీని సాధించడంతోపాటు అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేయడంలో ఇది అత్యంత అవసరమన్నారు. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా స్వచ్ఛ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విషయంలో ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం , ఒకే గ్రిడ్ దిశగా ప్రధాన మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవన్నారు. ఇక ఆర్థిక అసమానతలను తొలగించడంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా అర్థిక అసమానతలను రూపుమాపడంలో చాలా మంచి నిర్ణయాలు అమలు చేశారని,. ఉచితంగా విద్య, ఆహార భద్రతలను చట్టబద్ధం చేశారన్నారు. ప్రధాని నాయకత్వంలో గ్రామాలను పెద్ద ఎత్తున విద్యుదీకరించారని,. పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు.
ఇదీ చదవండి: cm jagan kadapa tour: నేటి నుంచి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన