ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహనీయుల త్యాగాల స్ఫూర్తితో.. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్దాం: జగన్​ - రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా తీసుకెళ్దాం: జగన్​

నవంబరు 1న ఆంధ్రప్రదేశ్​ అవతరణ దినోత్సవాన్ని (ap formation day wishes) పురస్కరించుకొని.. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​ శుభాకాంక్షలు(cm jagan wishes) తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దివంగత పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్

By

Published : Oct 31, 2021, 9:19 PM IST

Updated : Nov 1, 2021, 2:32 AM IST

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం((ap formation day on november 1st)) సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పొట్టి శ్రీరాములు సహా ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు.. రాష్ట్ర ఏర్పాటుకు దారితీశాయని.. వారి పోరాటం స్ఫూర్తిదాయకమైనదన్నారు. వారి దృఢ సంకల్పం, అంకితభావం, చిత్తశుద్ధి స్పూర్తిగా తీసుకుని …రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం.. జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. తర్వాత తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం నివాళులర్పించనున్నారు.

Last Updated : Nov 1, 2021, 2:32 AM IST

ABOUT THE AUTHOR

...view details