ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు దిల్లీకి జగన్‌, చంద్రబాబు.. ఎందుకంటే..? - సీఎం జగన్​ దిల్లీ పర్యటన

Jagan Delhi tour: నేడు సీఎం జగన్​ దిల్లీ వెళ్లనున్నారు. విశాఖ నుంచి రాత్రి 7.50 నిమిషాలకు సీఎం జగన్​ పయనమవుతారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు కూడా దేశ రాజధానికి వెళ్తున్నారు.

Jagan Delhi tour
జగన్‌, చంద్రబాబు

By

Published : Aug 6, 2022, 6:36 AM IST

Updated : Aug 6, 2022, 12:07 PM IST

Jagan Delhi tour: ముఖ్యమంత్రి జగన్‌, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు శనివారం దిల్లీ వెళ్తున్నారు. వారిద్దరూ అక్కడ జరిగే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే సీఎం జగన్ దిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ, రేపు శ్రీకాకుళం, హైదరాబాద్, దిల్లీలలో సీఎం జగన్​ పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లి నుంచి ఆమదాలవలస పయనమవుతారు. ఆమదాలవలసలో సభాపతి తమ్మినేని కుమారుడు నాగ్ వివాహ వేడుక పాల్గొంటారు. సాయంత్రం 5.20కు విశాఖ నుంచి శంషాబాద్‌ వెళ్లనున్నారు. అక్కడి నుంచి 6.55 గంటలకు నార్సింగిలో జి.వి.ప్రతాప్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. రాత్రి 7.50కు శంషాబాద్‌ నుంచి దిల్లీ బయల్దేరనున్నారు. రాత్రి 9.30కు దిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. రేపు ఉదయం 9.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌ చేరుకుంటారు. అక్కడ నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీలో 4.30 వరకు సీఎం జగన్​ పాల్గొంటారు. రేపు రాత్రి 8.15 గం.కు దిల్లీ నుంచి విజయవాడకు తిరుగుపయనం ఉంటుంది.

చంద్రబాబు దిల్లీ పర్యటన:శనివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జాతీయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. శనివారం రాత్రికి దిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌ చేరుకుంటారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 6, 2022, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details