CM Jagan and Chandra babu Condolences : భారతరత్న సర్ధార్ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి పూలు సమర్పించి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు, ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్ పాల్గొని నివాళులు అర్పించారు.
CM Jagan and Chandra babu Condolences : పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ లకు సీఎం జగన్, చంద్రబాబు నివాళులు - సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సీఎం జగన్ నివాళులు
CM Jagan and Chandra babu Condolences : పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ ల వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహనీయుల సేవలను స్మరించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు వారికి నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వారి ఉనికిని కాపాడారని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాముల పోరాటమే నాందని గుర్తు చేశారు. సర్దార్ పటేల్ దృఢ సంకల్పంతో భారతదేశాన్ని ఏకం చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, అశోక్‌బాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : National Highways Upgradation: రాష్ట్రంలో రెండు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం