నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్...ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు రేణిగుంట విమానాశ్రయం నుంచి..ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను.. విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. పంట, ఆస్తి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు రేణిగుంటకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే - నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్‌లో కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించారు. పంట, ఆస్తి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
cm jagan
TAGGED:
నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే