ఐఏఎస్ అన్నది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలను సంతృప్తిపరిచే కస్టమర్ సర్వీసులా మారిందంటూ శ్రీ సిద్ధూ అనే ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ట్వీట్ చేశారు.'సర్వీసులో ఉన్న అధికారుల్లో కొందరు ప్రజాప్రయోజనాల కోణంలో నిర్ణయాలు తీసుకోకుండా అధికారంలో ఉన్నవారిని సంతృప్తి పరిచేందుకు వ్యవస్థలను, చట్టాలను నాశనం చేస్తున్నారు.'అంటూ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాగ్లీ అంతర్జాతీయ అధ్యయన కేంద్రంలో సీనియర్ పరిశోధకులుగా పని చేస్తున్న పుకుయామా ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్యలనూ రమేశ్ పోస్టు చేశారు. ఈ పోస్టుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలను ట్యాగ్ చేశారు.
ఐఏఎస్ అన్నది కస్టమర్ సర్వీసులా మారింది: పీవీ రమేశ్ - సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ట్వీట్
ఐఏఎస్ అన్నది కొందరిని సంతృప్తిపరిచే కస్టమర్ సర్వీసులా మారిందంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ట్వీట్ చేశారు.
pv ramesh tweet on IAS post