ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా పునరావాస శిబిరాలు తెరిచి సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. వరదలపై గోదావరి జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
'అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలి' - ఏపీపై గోదావరి వరదల ప్రభావం
గోదావరి వరదలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. సీఎంవో సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపుప్రాంతాల నుంచి చాలామందిని తరలించారని సీఎంవో సిబ్బంది ముఖ్యమంత్రికి తెలిపారు. వరదల దృష్ట్యా మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎంవో సిబ్బంది వివరించింది. గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎంవో తెలిపింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
రక్షణ, సహాయచర్యలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్న సీఎం... ఎస్డీఆర్ఎఫ్‌తో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి ఉద్ధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలన్న సీఎం... కృష్ణాజిల్లాలో వర్షాలు, అనంతర పరిస్థితులపైనా ఆరాతీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
ఇదీ చదవండీ... రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలదిగ్భందంలో లోతట్టు ప్రాంతాలు