సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ - సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
కరోనా నివారణకు సహాయ చర్యల్లో భాగంగా సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. జీఎంఆర్ సంస్థ, మిడ్‌వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్కొక్క సంస్థ కోటి రూపాయిలు, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ 3 కోట్ల రూపాయలను సహాయనిధికి అందించారు.
కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ కు జీఎంఆర్ సంస్థ కోటి రూపాయల విరాళమిచ్చింది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయగా.... ఆ సంస్థ ప్రతినిధి జి.శ్రీనివాస్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రశీదు అందించారు. మిడ్‌వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోటి రూపాయల విరాళం అందించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఆ సంస్థ సీఈవో రామచంద్ర కొల్లారెడ్డి చెక్కు అందజేశారు. సీఎం సహాయనిధికి రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ 3 కోట్ల రూపాయల విరాళమిచ్చింది. రాంకీ సంస్థ ఎండీ,సీఈవో గౌతమ్‌రెడ్డి, ఆళ్ల శరణ్ సీఎం జగన్‌కు చెక్కు అందజేశారు. దీంతో పాటు 2 కోట్ల రూపాయల విలువైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్లు అందిస్తున్నట్లు రాంకీ సంస్థ తెలిపింది. ఏపీ టైక్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్... ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళమిచ్చింది. టెక్స్‌టైల్స్ మిల్స్ అసోసియేషన్ ఛైర్మన్ లంకా రఘురామిరెడ్డి సీఎం జగన్‌కు చెక్కు అందజేశారు.