రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్... శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కర్తవ్య దీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడని గుర్తు చేశారు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలని పేర్కొన్నారు.
తెలుగు ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు - సీఎం జగన్ కృష్ణాష్టమి శూభాకాంక్షలు
కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు, నారాలోకేశ్లు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
భగవద్గీత ద్వారా మానవాళికి కాలాతీత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకొంటున్న తెలుగువారందరికీ కృష్ణాష్టమి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాదికీ ఆ శ్రీకృష్ణుడు ఆనంద, సౌభాగ్యాలను, అద్భుత విజయాలను అనుగ్రహించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ.. గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేసిన కృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజైన కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణభగవానుడి ఆశీస్సులు అందరికీ కలగాలని లోకేశ్ ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: