ఓ వ్యాపారికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ఉందా.. అంటూ మాటల్లో పెట్టి అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.19,858 స్వాహా చేసిన ఘటన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో జరిగింది. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఓ బట్టల దుకాణం యజమాని నగదును కాజేశారు.
ఫోన్ పే ఉందా అని కాల్ చేశారు... నగదు కాజేశారు! - telangana latest news
ఓ బట్టల వ్యాపారికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. మీ ఫోన్లో ఫోన్ పే ఉందా? గూగుల్ పే ఉందా? అని మాటల్లో పెట్టారు. చివరకు ఆ వ్యాపారి అకౌంట్లో ఉన్న నగదు కాజేశారు. ఈ ఘటన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో జరిగింది.

బాధితునికి 73188 24947, 73191 26101 నంబర్ల నుంచి ఓ అపరిచితుడు ఫోన్లు చేసి తాను దిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, మీ ఫోన్లో ఫోన్ పే, గూగుల్ పే ఉందా అంటూ మాటల్లో పెట్టాడు. ఫోన్ పెట్టేసిన వెంటనే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన తన అకౌంట్ నుంచి విడతల వారీగా వరుసగా రూ.5,430, రూ.2,000, రూ.1,000, రూ.999, రూ.5,430, రూ.2,000, రూ.999, రూ.2,000 విత్ డ్రా అయ్యి... అతని అకౌంట్ నుంచి డబ్బులు తీసినట్లు మెసేజ్‌లు వచ్చాయని బాధితుడు తెలిపారు. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూడగా తన అకౌంట్లో రూ.19,893 ఉండాల్సి ఉండగా రూ.35 మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు.