ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్టోబర్​ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండో దశ కార్యక్రమం - Cleanness program in ap news

'మనం-మన పరిశుభ్రత' రెండోదశ కార్యక్రమం అమలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖలు రాశారు.

Cleanness second Phase Program starts from October 2nd
అక్టోబర్​ 2నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ కార్యక్రమం

By

Published : Sep 23, 2020, 5:15 PM IST

అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ కార్యక్రమం అమలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ప్రతి మండలానికి 5 నుంచి 10 గ్రామాలలో ఈ కార్యక్రమం అమలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ 1న రాష్ట్రంలో మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని పంచాయతీ రాజ్ శాఖ మొదలు పెట్టింది. దీనిలో భాగంగా 1320 గ్రామ పంచాయతీల్లో తొలిదశలో ప్రజాభాగస్వామ్యంతో పల్లెల్లో 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తి తగ్గినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. పంచాయతీలకు విరాళాలుగా 1.72 కోట్లు జమ అయినట్లు పంచాయతీ రాజ్ శాఖ తెలిపింది. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖలు రాశారు.

ABOUT THE AUTHOR

...view details