తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఆ స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా ప్రాంగణంలో పరిపాలన విభాగంతోపాటు అందుబాటులో ఉన్న గదులను వైరస్ నివారణ వార్డులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ: కరోనా కోసం గచ్చిబౌలి స్టేడియం శుభ్రం - 50 పడకల క్వారంటైన్ కేంద్రం
తెలంగాణలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంను 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. శేరిలింగంపల్లి సర్కిల్ 11 పారిశుద్ధ్య విభాగం సిబ్బంది స్టేడియంలో పనుల్లో నిమగ్నమయ్యారు.
clean-the-gachibowli-stadium-effect-of-corona-virus-in-telangana
గచ్చిబౌలి స్టేడియాన్ని 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు మొదలుపెట్టారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతోపాటు జీహెచ్ఎంసీ అధికారులు స్టేడియాన్ని పరిశీలించారు. శేరిలింగంపల్లి సర్కిల్ 11 పారిశుద్ధ్య విభాగం సిబ్బంది స్టేడియంలో శుభ్రత పనులు ప్రారంభించారు. రెండురోజుల్లో పూర్తి స్థాయిలో ఆ స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ చూడండి :కరోనా కట్టడికి ప్రత్యేక చెక్‌పోస్టులు: మంత్రి ఈటల