ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థులను పోలీసులు కొట్టారంటూ గ్రామస్థుల ఆందోళన - clashes between police and students in burja mandal news

అకారణంగా విద్యార్థులను పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని పాలవలస, లక్కుపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

burja mandal of srikakulam
burja mandal of srikakulam

By

Published : Nov 21, 2020, 9:54 PM IST

విద్యార్థులను పోలీసులు కొట్టారంటూ గ్రామస్థుల ఆందోళన

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస, లక్కుపురం గ్రామాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు గ్రామాలకు చెందిన కొంతమంది విద్యార్థులను పోలీసులు అకారణంగా కొట్టారని ఆరోపిస్తూ ఇరు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ బాధిత విద్యార్థుల తరపు కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించారు. ఒక క్రమంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details