ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోడు భూముల వద్ద ఉద్రిక్తత.. అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య ఘర్షణ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. సత్తుపల్లి మండలం రేగళ్లపాడులో అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది.

Clashes between forest personnel
అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య ఘర్షణ

By

Published : Jul 29, 2021, 5:21 PM IST

అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య ఘర్షణ

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. సత్తుపల్లి మండలం రేగళ్లపాడులో అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది. పోడు భూముల్లో సాగు చేసేందుకు వెళ్లిన గిరిజనులను అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అటవీ సిబ్బంది తీరును నిరసిస్తూ గిరిజన రైతుల ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న గిరిజనులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం మాదారంలో పోడు భూముల వివాదం తలెత్తింది. అటవీ సిబ్బంది పోడు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టారు. మాదారం గిరిజన రైతులు అడ్డుకున్నారు. అటవీ సిబ్బంది, గిరిజన రైతుల మధ్య తోపులాట జరిగింది.

ABOUT THE AUTHOR

...view details