ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: కేపీహెచ్‌బీలో భాజపా, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ - జీహెచ్​ఎంసీ ఎన్నికల తాజా వార్తలు

హైదరాబాద్​ కూకట్‌పల్లి ఫోరమ్ మాల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బులు పంచుతున్నారంటూ భాజపా, తెరాస శ్రేణుల పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

kphb
kphb

By

Published : Dec 1, 2020, 11:49 AM IST

కేపీహెచ్‌బీలో భాజపా, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ

జీహెచ్​ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కూకట్‌పల్లి ఫోరమ్ మాల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బులు పంచుతున్నారంటూ భాజపా, తెరాస శ్రేణుల పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కారులో డబ్బులు పంచుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు. మంత్రి పువ్వాడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్న కారుపై భాజపా కార్యకర్తల దాడి చేశారు. తెరాస కార్యకర్తను భాజపా కార్యకర్తలు కొట్టారని సమాచారం. భాజపా, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details