ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

IAMC Inauguration: హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మక కేంద్రం.. ప్రారంభించనున్న సీజేఐ - amaravati latest news

IAMC Inauguration: హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ) నేడు ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ప్రారంభించనున్నారు.

IAMC Inauguration
IAMC Inauguration

By

Published : Dec 18, 2021, 7:52 AM IST

IAMC Inauguration in Hyderabad: హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్​ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్​లో ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.

IAMC in Nanakramguda: నగరంలోని నానక్​రాంగూడలోని ఫీనిక్స్ వీకే టవర్​లో 25 వేల చదరపు అడుగులతో ఐఏఎంసీని సిద్ధం చేశారు. ఐఏఎంసీ కేంద్రాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీజేఐ ఎన్వీ రమణకు అప్పగించనున్నారు. అనంతరం వెబ్ సైట్​ను కేసీఆర్ ప్రారంభిస్తారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించనున్నట్లు ఈనెల 4న జరిగిన ఐఏఎంసీ పరిచయ కార్యక్రమంలో సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎంసీ ట్రస్టీలుగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.రవీంద్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details