జర్నలిస్టుల కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేక యాప్ను రూపోందించింది. ఆ అప్లికేషన్ను సీజేఐ జస్టిస్ ఎన్.వీ రమణ ప్రారంభించారు. జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్లయ్ కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు జస్టిస్ ఎన్.వీ రమణ పేర్కొన్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే యాప్ రూపొందించినట్లు తెలిపారు.
సుప్రీం రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే... జర్నలిస్టులు రిపోర్ట్ చేసేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి తెస్తామన్నారు. కొవిడ్ బారిన పడి మృతి చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి.. సీజేఐ, ఇతర న్యాయమూర్తులు సంతాపం తెలిపారు.