ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CJI JUSTICE NV RAMANA: సమకాలీన అంశాలపై యువత దృష్టి సారించాలి: సీజేఐ

సమాజంలో సానుకూల మార్పు కోసం విద్య, సమకాలీన అంశాలపై యువత దృష్టి సారించాలని సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ(CJI JUSTICE NV RAMANA) సూచించారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో విద్యాసంస్థలు ప్రముఖ పాత్ర పోషించాలని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(VIVEKANANDA INSTITUTE OF HUMAN EXCELLENCE) 22వ వ్యవస్థాపక దినోత్సవంలో జస్టిస్​ రమణ.. వర్చువల్​గా పాల్గొన్నారు.

cji ramana
cji ramana

By

Published : Sep 12, 2021, 3:22 PM IST

యువ న్యాయవాదులతో కలిసి పని చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ(CJI JUSTICE NV RAMANA) తెలిపారు. ఈ తరం యువత.. లక్ష్యంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారని పేర్కొన్నారు. విజయం సాధించాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. లక్ష్యం సాధించాలంటే పట్టుదల, అవగాహన ముఖ్యమని.. దీనిలో విద్యావ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు. హైదరాబాద్​లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(VIVEKANANDA INSTITUTE OF HUMAN EXCELLENCE) 22వ వ్యవస్థాపక దినోత్సవంలో జస్టిస్​ రమణ.. వర్చువల్​గా పాల్గొన్నారు. సమావేశంలో యువతకు పలు సూచనలు చేశారు.

మేము చదువుకునే రోజుల్లో ఎన్నో సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్నాం. కానీ ఈ కాలం యువతకు ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. టెక్నాలజీ వినియోగం పెరగడంతో ప్రపంచమే అరచేతిలో ఉంటోంది. నాలుగు గోడల మధ్య ఉంటూనే అంతర్జాలం సహాయంతో ప్రపంచాన్నే చుట్టేయొచ్చు. -జస్టిస్​ ఎన్వీ రమణ, సీజేఐ

పుస్తకాలు చదవాలి

రాజకీయాలు, సమకాలీన పరిస్థితులపై అవగాహన రావాలంటే యువత పుస్తకాలు చదవాలని జస్టిస్​ సూచించారు. రాజకీయ అంశాలు, సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై కచ్చితంగా అవగాహన ఉండాలన్నారు. తద్వారా యువత తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేటి యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని.. అందులో భాగంగా క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు.

చట్టంపై అవగాహన రావాలి

పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలు సందర్శించాలని.. దీంతో అర్బన్​ ఏరియాల్లోని తారతమ్యాలు తెలుస్తాయని జస్టిస్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు సందర్శించడం ద్వారా వారి జీవన విధానం తెలుస్తుందని సూచించారు. సమాజంలో సానుకూల మార్పు రావాలంటే యువత విద్య, సమకాలీన పరిస్థితులపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలు వారికి చట్టంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో విద్యాసంస్థలు, విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని జస్టిస్​ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

గుజరాత్ సీఎం రేసులో ఐదుగురు- కాసేపట్లో స్పష్టత!

ABOUT THE AUTHOR

...view details