తెలుగు జాతిని ఎన్టీఆర్ ప్రభావితం చేసిన తీరు.. నభూతో నభవిష్యత్ : సీజేఐ - NTR centenary updates
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి ఎన్టీఆర్ నాంది పలికారని.. అడుగు పెట్టిన ప్రతిరంగాన్నీ సుసంపన్నం చేశారని కొనియాడారు.
CJI Justice NV Ramana paid tributes to ntr
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా.. ఆయన చేసిన సేవలను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. తెలుగు జాతికి విశిష్టమైన గుర్తింపు తెచ్చిన మహోన్నతుడుని కీర్తించారు. దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి ఎన్టీఆర్ నాంది పలికారన్నారు. అడుగు పెట్టిన ప్రతిరంగాన్నీ సుసంపన్నం చేశారన్నారు. ఆయనో గొప్ప ప్రజాస్వామికవాది, లౌకికవాది అని కొనియాడారు. తెలుగు జాతిని ఎన్టీఆర్ ప్రభావితం చేసిన తీరు నభూతో నభవిష్యత్ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.