తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేయనున్న బియ్యం సంచులను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. సంచుల పంపిణీ ప్రారంభించాలని సీఎం ఆదేశించారని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. కొత్త బియ్యం కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసిన అయిదు రోజుల్లోనే అర్హతలు పరిశీలించి.. కొత్త కార్డులు జారీ చేస్తామని శశిధర్ పేర్కొన్నారు.
త్వరలో బియ్యం సంచుల పంపిణీ.. - 6 నుంచి కొత్త బియ్యం కార్డులు న్యూస్
నాణ్యమైన బియ్యం పంపిణీలో భాగంగా బియ్యం కార్డు దారులకు ప్రభుత్వం త్వరలో ఉచితంగా సంచులు పంపిణీ చేయనుంది. వాటిని సీఎం జగన్ పరిశీలించారు.
civil supplies department distribution new rice cards from 6th june