ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏటికేటికి పెరుగుతున్న పౌర సరఫరాల సంస్థ అప్పు... ప్రస్తుతం ఎంతంటే..? - పెరిగిపోతున్న ఏపీ పౌర సరఫరాల సంస్థ రుణాల చిట్టా

Civil supplies debt: పౌర సరఫరాల సంస్థ అప్పుల చిట్టా భారీగా పెరిగిపోతోంది. ఇప్పటివరకు మొత్తం అప్పు రూ.రూ.31వేల కోట్లకు చేరింది. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.500 కోట్లు అప్పు తీసుకున్నట్లు పౌర సరఫరాల సంస్థ వెల్లడించింది.

Civil supplies debt
పౌర సరఫరాల సంస్థ అప్పు

By

Published : Mar 15, 2022, 9:10 AM IST

Civil supplies debt: పౌర సరఫరాల సంస్థ అప్పుల చిట్టా ఏటికేడు పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.3,500 కోట్లకు పైగా రుణంగా తీసుకోగా మొత్తం అప్పులు రూ.31వేల కోట్లకు చేరింది. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.500 కోట్ల రుణానికి మార్గం సుగమమైంది. గతంలో అనుమతించిన రూ.5వేల కోట్ల నుంచి రూ.500 కోట్ల రుణానికి హామీ ఇస్తూ పౌర సరఫరాల శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంస్థకు గరిష్ఠ రుణ పరిమితి రూ.32వేల కోట్లుగా ఉంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details