ఎల్లుండి ధాన్యం కొనుగోలు చెల్లింపులు చేస్తాం: కోన శశిధర్ - లేటెస్ట్ న్యస్ ఆఫ్ కోన శశిధర్
సీఎం జగన్‌తో పౌర సరఫరాల శాఖ కమిషనర్ శశిధర్ సమావేశమయ్యారు. ధాన్యానికి మద్దతు ధర, రైతులకు బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎల్లుండి చెల్లింపులు చేస్తామని కోన శశిధర్ స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎల్లుండి చెల్లింపులు చేస్తామని... ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన శశిధర్... ధాన్యానికి మద్దతు ధర, రైతులకు బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 44లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. కేంద్ర ప్రభుత్వం నుంచి బకాయిలు రానందువల్లే రైతులకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోయామని సీఎంకు వివరించినట్లు శశిధర్ చెప్పారు.