ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​ను​ కలిసిన సినీ నిర్మాతలు - హుద్ హుద్ బాధితులకు సినీ పరిశ్రమ ఇళ్లు న్యూస్

ముఖ్యమంత్రి జగన్​ను పలువురు సినీ నిర్మాతలు కలిశారు. హుద్ హుద్ సమయంలో సినీ పరిశ్రమ నిధులు సేకరించిన విషయాన్ని నిర్మాతలు జగన్​కు గుర్తు చేశారు.

cinema producers met cm jagan
cinema producers met cm jagan

By

Published : Feb 26, 2020, 6:04 PM IST

Updated : Feb 26, 2020, 6:43 PM IST

సీఎం జగన్​ను​ సినీ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్, వల్లభనేని వంశీ కలిశారు. హుద్ హుద్ సమయంలో సినీ పరిశ్రమ నిధులు సేకరించిందని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. ఆ నిధులతో విశాఖలో తుపాను బాధితులకు ఇల్లు కట్టించామని నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ తెలిపారు. దాదాపు రూ.15 కోట్లతో 320 ఇళ్లు కట్టించినట్లు వెల్లడించారు. విశాఖలో గృహ సముదాయాల ప్రారంభానికి ముఖ్యమంత్రి రావాలని కోరామని.. తమ ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

సీఎం జగన్​ను​ కలిసిన సినీ నిర్మాతలు
Last Updated : Feb 26, 2020, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details