ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిగ్రీ అర్హత పరీక్షకు టాలీవుడ్ ప్రముఖ నటి - Cine actress hema in nalgonda

తెలంగాణలోని నల్గొండలో పరీక్ష రాశారు సినీనటి హేమ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దరఖాస్తు చేసుకున్న ఆమె.. అర్హతా పరీక్షను ఆదివారం ఎన్జీ కళాశాలలో రాశారు.

టాలీవుడ్ ప్రముఖ నటి
టాలీవుడ్ ప్రముఖ నటి

By

Published : Sep 28, 2020, 9:53 AM IST

Updated : Sep 28, 2020, 11:14 AM IST

విద్యార్హతలు పెంచుకోవడానికి వయసుతో సంబంధం లేదని చదువుకోవాలని జిజ్ఞాస ఉంటే సరిపోతుందని చాలా మంది నిరూపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కోవలో సినీ నటి హేమ చేరారు. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దరఖాస్తు చేసుకున్న ఆమె.. అర్హతా పరీక్షను ఆదివారం తెలంగాణలోని నల్గొండలో గల ఎన్జీ కళాశాలలో రాశారు.

ఎప్పటినుంచో డిగ్రీ చేయాలని ఉందని హైదరాబాద్ అయితే ఇబ్బంది ఉంటుందని నల్గొండలో పరీక్ష రాసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ లో పాల్గొంటున్నానని... నల్గొండ అయితే ఫిలింసిటీకి దగ్గరగా ఉండటం, హైదరాబాద్ లో కొవిడ్ కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు తదితరాలు ఉండడం వల్ల ఇక్కడ నల్గొండలో పరీక్ష రాసినట్టు చెప్పింది.

ఇదీ చూడండి: తెలంగాణ పోలీసుల మీద కరోనా అధిక ప్రభావం

Last Updated : Sep 28, 2020, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details