మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు - ap latest news
11:09 April 15
దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు
మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. సీఎం జగన్ మాటలను వక్రీకరించారన్న న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు గొల్లపూడిలోని ఉమ నివాసంలో ఆయనకు నోటీసులు అందజేశారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కర్నూలు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రెస్‌మీట్‌లో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని అభియోగం నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 464, 465, 468, 469, 470, 471, 505, 1200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:హైదరాబాద్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. సజీవ దహనమైన ఇద్దరు ఏపీ వాసులు