ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ నేడు సీఐడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని విజయ్ నివాసానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. సీఎం సతీమణి పేరుతో తప్పుడు వార్త సృష్టించారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసే క్రమంలో డ్రైవర్ పై చేయి చేసుకున్నారని.. 5ఏళ్ల పిల్లల్ని ప్రశ్నించారంటూ.. సీఐడీ పోలీసులపై విజయ్ వర్గీయులు కేసులు పెట్టారు. ఈ ఉదయం పదిన్నరకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంన్నదున విజయ్ హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశమైంది.
విచారణకు హాజరుకావాలని చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు - ap CID
ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ నేడు సీఐడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని విజయ్ నివాసానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. సీఎం సతీమణి పేరుతో తప్పుడు వార్త సృష్టించారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.
ఏపీ సీఐడీ పోలీసులు