రాజధాని ప్రాంతంలోని తన అసైన్డ్ భూమిని ఎవరూ బలవంతంగా తీసుకోలేదని... తానే స్వచ్ఛందంగా అమ్ముకున్నానని వెల్లడించిన ఉద్ధండరాయునిపాలేనికి చెందిన ఎస్సీ రైతు పూల రవికి సీఐడీ అధికారులు సోమవారం నోటీసులిచ్చారు. సీఆర్‌పీసీలోని 160 సెక్షన్ ప్రకారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నోటీసు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి రావాలంటూ మధ్యాహ్నం 12 గంటలకు నోటీసు ఇచ్చారు. తాను ఓ వేడుకలో ఉన్నానని.. వెంటనే అంటే విచారణకు రాలేనని రవి చెప్పారు. దాంతో తాము పిలిచినప్పుడు హాజరుకావాలని సీఐడీ సిబ్బంది ఆయనకు సూచించారు. సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఏ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసు ఇచ్చారు. ‘‘ఐపీసీలోని 166, 167, 217, 120 (బీ) రెడ్‌విత్ 34, 35, 36, 37 సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1)(ఎఫ్)(జీ), ఏపీ అసైన్డ్ భూములు బదలాయింపు నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం సీఐడీ క్రైమ్ నెంబర్ 05/2021ను గతంలో నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం సాగుతోంది. దీనికి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు మీకు తెలిసి ఉంటాయని భావిస్తున్నాం. అసైన్డ్ భూముల బదలాయింపునకు సంబంధించిన కొన్ని పత్రాలపై మీరు సాక్షిగా కూడా సంతకాలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ ఎదుట హాజరుకాగలరని’’ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
అమరావతి రైతుకు సీఐడీ నోటీసులు - అమరావతి రైతుకు నోటీసులు
అమరావతి రైతుకు సీఐడీ నోటీసులిచ్చింది. తన భూమిని ఎవరూ బలవంతంగా లాక్కోలేదని.. రాజధాని నిర్మాణం కోసం తానే స్వయంగా అమ్ముకున్నానని ఆయన వెల్లడించిన అనంతరం ఈ పరిణామం జరిగింది. సీఆర్‌పీసీలోని 160 సెక్షన్ ప్రకారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నోటీసు జారీ చేశారు.
![అమరావతి రైతుకు సీఐడీ నోటీసులు cid issued notice to amaravathi farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12367771-1062-12367771-1625536835691.jpg)
cid issued notice to amaravathi farmers cid issued notice to amaravathi farmers