ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దురుద్దేశంతో ఆ జీవో తెచ్చారు: సీఐడీ - cid on amaravathi assigned lands issue

రాజధాని అమరావతిలోని అస్సైన్డ్‌ భూముల విషయంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవో 41 తీసుకొచ్చారని సీఐడీ.. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. అమరావతి ఎస్సైన్డ్‌ భూముల విషయంలో హైకోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. చంద్రబాబు విషయంలో ఈ ఏడాది మార్చి 19న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు.

cid filled counter in amaravathi assigned lands
cid filled counter in amaravathi assigned lands

By

Published : May 8, 2021, 9:12 AM IST

రాజధాని అమరావతిలోని అస్సైన్డ్‌ భూముల విషయంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2016 ఫిబ్రవరి 17న జీవో 41 తీసుకొచ్చారని సీఐడీ.. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. ఆ జీవో ఏపీ ఎస్సైన్డ్‌ భూముల బదిలీ నిషేధ చట్టం, ఏపీసీఆర్‌డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఐడీ దర్యాప్తు అధికారి ఎ.లక్ష్మీనారాయణరావు ఇటీవల కౌంటర్‌ వేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఈ ఏడాది మార్చి 19న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. చంద్రబాబు వేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు.

అమరావతి ఎస్సైన్డ్‌ భూముల విషయంలో వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు.. సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మార్చి 19న మధ్యంతర ఉత్తర్వులనిచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారి హైకోర్టులో కౌంటర్‌ వేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details