CID chief Sunil kumar on MP Gorantla Viral Video: ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నట్లు చెబుతున్న వీడియో అసలైనదేనని అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. ఆ ల్యాబ్ అధికారి జిమ్ స్టఫోర్డ్‌కు తాము లేఖ రాస్తే.. ఈ మేరకు సమాధానమిచ్చారని ఆయన చెప్పారు. ఆయన ఇచ్చినట్లు సర్క్యులేట్ అవుతున్న పత్రం కూడా అసలైనది కాదని ఆయనే చెప్పినట్లు వెల్లడించారు. అయితే.. ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే ధ్రువీకరణకు ఎలాంటి ప్రామాణికత లేదని సీఐడీ అధినేత సునీల్ కుమార్ చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో పులులు, సింహాలు ఉన్న సన్నివేశాన్ని ఫోన్‌లో రికార్డు చేసి.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే అది ఒరిజినల్‌గానే చెబుతారన్నారు. వీడియో సంభాషణ జరిగిన మహిళ లేదా పురుషుడి ఫోన్లలో రికార్డైన వీడియో దొరికితేనే.. అసలోకాదో తెలుస్తుందని సునీల్ కుమార్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐటీ చట్టం ప్రకారం, సీఆర్పీసీ ప్రకారం కొన్ని తప్పులు జరిగినట్లు సునీల్ కుమార్ తెలిపారు. కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే ధ్రువీకరణకు ప్రామాణికత లేదన్న సీఐడీ చీఫ్ - ఎంపీ గోరంట్ల మాధవ్
CID chief on MP Gorantla Viral Video ఇటీవల రాష్ట్రంలో కలకలం రేపిన హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ స్పందించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష తెదేపా అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక తెప్పించగా ప్రైవేటు ఫొరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికమని, దానిని తాము గుర్తించబోమని స్పష్టం చేశారు.

‘‘రాష్ట్రంలో ఒక వీడియో కాల్ వైరల్ అయింది. ఒక పురుషుడు-మహిళ మాట్లాడుకున్న వీడియో కాల్‌ను వేరొకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ వీడియోలో ఉన్నట్లు కొందరు ఆరోపించారు. వీడియోలో మాట్లాడుకున్నదానిని వేరే ఫోన్‌లో రికార్డు చేసి పంపారు. అమెరికాలోని ఓ ప్రైవేటు ఫొరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికం? ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టును మేం గుర్తించబోం. జిమ్ క్లిఫోర్డ్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం కూడా అసలైనది కాదు. స్వయంగా జిమ్ క్లిఫోర్డ్ ఆ అంశాన్ని ధ్రువీకరించారు. ప్రభుత్వ ఆదేశాలతో జిమ్ క్లిఫోర్డ్‌కు సీఐడీ తరఫున లేఖ రాశాం. మా లేఖకు సమాధానం కూడా వచ్చింది. తామిచ్చిన రిపోర్టు కూడా అసలైంది కాదని ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. తనిఖీ చేస్తేనే అసలైనదా? మార్ఫింగ్ చేశారా? అనేది చెప్పగలం. జిల్లా ఎస్పీ ఫకీరప్ప కూడా అదే చెప్పారు. ఒరిజినల్ వీడియో క్లిప్ లేకుండా ఎలా తనిఖీ చేయగలం? నిపుణుల రిపోర్టులో మార్పులు చేస్తే ప్రామాణికత ఎక్కడుంది? ఫేక్ లెటర్లు ప్రచారం చేసిన వారిపై ఐటీ చట్టం 67 ప్రకారం కేసులు పెడతాం’’ -సునీల్‌కుమార్, సీఐడీ చీఫ్
ఇవీ చదవండి: