నేటి సాయంత్రం 5 గంటల వరకు.. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వివరాలను సరిచూసుకునేందుకు సీఐడీ గడువు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6 నుంచి డిపాజిటర్ల వివరాలను సేకరణ కొనసాగుతోంది. రూ. 20 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులు తమ వివరాలను సరిచూసుకోవచ్చని సీఐడీ తెలిపింది. డబ్బు చెల్లించిన అసలు రశీదులతో వాలంటీర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. వాలంటీర్ల వద్ద వీలు కాకపోతే ఎంపీడీవో కార్యాలయంలో పత్రాలు ఇవ్వాలని తెలిపింది.
Agrigold: అగ్రిగోల్డ్ డిపాజిటర్ల దరఖాస్తుకు.. నేటి సాయంత్రం వరకు అవకాశం! - అగ్రిగోల్డ్ సీఐడీ వార్తలు
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వివరాలను సరిచూసేందుకు సీఐడీ మరో అవకాశం ఇచ్చింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది.
cid AgriGold Application time extend
Last Updated : Aug 19, 2021, 6:58 AM IST