రామోజీ ఫిల్మ్ సిటీలో కేక్ మిక్సింగ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని... డాల్ఫిన్ హోటల్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేడుకల కోసం కేక్‌ను సిద్ధం చేసేందుకుగానూ... డ్రై ఫ్రూట్స్, ఇతర ద్రవాలను హోటల్ సిబ్బంది మిక్స్ చేశారు. 8 రకాలైన 30 కిలోల డ్రైఫ్రూట్స్‌ను వివిధ రకాల ద్రవాలతో 45 రోజుల పాటు కలియబెట్టనున్నారు. అనంతరం తయారైన కేక్‌ను క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా అతిథులకు అందజేయనున్నారు.
గత ఏడాది కరోనా కారణంగా సందడి బాగా తగ్గగా... ఈ సారి సాధారణ పరిస్ధితులు నెలకొనడం, అతిథుల రాకపోకలు పెరగడంతో కేక్ మిక్సింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు సిబ్బంది తెలిపారు.