జీవో నెంబర్ 77కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విద్యార్థుల తరపున పోరాడుతున్న యువకుల భవిష్యత్తును దెబ్బతీసేందుకు ఈ దారుణమైన చర్య జరిగిందని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు.
యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు: చంద్రబాబు
పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. జీవో నెంబర్ 77కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారని ధ్వజమెత్తారు.
Chnadrababu serious comments on Police over rape case on students