ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తున్నా చలనం లేదా..?: చంద్రబాబు - latest news in chandrababu

తెదేపా సాంస్కృతి విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్​పై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

chnadrababu
chnadrababu

By

Published : Feb 14, 2021, 3:23 PM IST

తెలుగుదేం పార్టీ సాంస్కృతి విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్​పై వైకాపా మూకలు దాడి చేశారని... తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక కార్యకలాపాల రూపంలో జగన్ ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న కక్షతోనే అతనిపై దాడికి పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. నరసింహప్రసాద్​పై దాడి చేయడమంటే ఎస్సీలపై దాడి చేయడమేనని మండిపడ్డారు. ప్రజలు ఓ వైపు పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్తున్నా ఇంకా చలనం లేదని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details