పీపీఏలపై వైకాపా నేతలు తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారులతోనే వాస్తవాలను వక్రీకరింపజేశారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ని హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేయడం వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్న చంద్రబాబు.. ఈఆర్సీ అంశాన్ని తెదేపా ప్రభుత్వానికి ముడిపెట్టాలనుకుంటున్న వారికి ఇది చెంపపెట్టని ట్వీట్ చేశారు.
"పీపీఏలపై వైకాపా నేతలవి తలాతోకా లేని ఆరోపణలు" - chmadrababau tweet on ycp allegations on PPAs
పీపీఏలపై వైకాపా నేతల ఆరోపణలపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
!["పీపీఏలపై వైకాపా నేతలవి తలాతోకా లేని ఆరోపణలు"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4542777-1034-4542777-1569339619118.jpg)
chmadrababau tweet on ycp allegations on PPAs
ఇదీ చదవండి: