సీబీఐ విచారణకు ఆదేశాలివ్వండి... హైకోర్టును అభ్యర్థించిన అనితారాణి - చిత్తూరు వైద్యురాలు అనితారాణి వ్యవహారం
17:34 June 15
హైకోర్టును ఆశ్రయించిన వైద్యురాలు అనితారాణి
చిత్తూరు వైద్యురాలు అనితారాణి హైకోర్టును ఆశ్రయించారు. ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని పిటిషన్ వేశారు. ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఐడీ నిష్పక్షపాతంగా విచారణ చేయడం లేదన్న అనితారాణి... తాను లేవనెత్తిన అంశాలపై సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనితారాణి పిటిషన్‌ను రేపు హైకోర్టు విచారించనుంది.
ఇవీ చదవండి:
కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు