ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: హిమాయత్ సాగర్ చెరువు పరిసరాల్లో చిరుత

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పోలీసులు, అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత.. ఈ ఉదయం హిమాయత్ సాగర్ చెరువు వద్ద కనిపించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది.. ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు.

chittha identified in rajendranager
హిమాయత్ సాగర్ వద్ద చిరుత ఆచూకీ

By

Published : May 16, 2020, 12:51 PM IST

Updated : May 16, 2020, 1:24 PM IST

హిమాయత్ సాగర్ చెరువు పరిసరాల్లో కనిపించిన చిరుత

ఇవాళ ఉదయం మొయినాబాద్​ మండలం అజీజ్ నగర్ గ్రామానికి చెందిన కిష్టయ్య చేపలు పట్టేందుకు హిమాయత్​ సాగర్​కు వెళ్లగా అక్కడ చిరుత కనిపించింది. కిష్టయ్య వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాడు. అతని నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. కిష్టయ్యను వెంటబెట్టుకొని చిరుత కనిపించిన ప్రాంతంలో గాలింపు చేపట్టారు.

48 గంటలు దాటుతున్న చిరుత దొరక్కపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రెండురోజుల క్రితం కాటేదాన్ వద్ద జాతీయ రహదారిపై లారీ డ్రైవర్​పై దాడి చేసినప్పటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.


ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి

Last Updated : May 16, 2020, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details