రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి వద్ద స్థానికులు చిరుతను గుర్తించారు. జాతీయ రహదారిపై గాయపడిన చిరుతను చూసి ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ, జూపార్కు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. రహదారిపై రాకపోకలను నియంత్రించారు. చిరుతను జూపార్కుకు తీసుకెళ్లేందుకు అటవీ అధికారులు ఏర్పాట్లు చేశారు. చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తుండగా... ఓ వ్యక్తిని గాయపరిచింది. అనంతరం తప్పించుకుని దగ్గర్లోని రైల్వే గేటు పక్కనే ఉన్న కష్మీరీ జిమాం తోటలోకి వెళ్లి అదృశ్యమైంది.
తెలంగాణ: హైవేపై చిరుత కలకలం - నగరంలో చిరుత
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కాటేదాన్ అండర్ బ్రిడ్జి వద్ద చిరుతను చూసి స్థానికులు బెంబేలెత్తారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని చిరుతను జూపార్కుకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు.
హైవేపై చిరుత
Last Updated : May 14, 2020, 11:26 AM IST