హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో నిరాడంబరంగా పంద్రాగస్టు వేడుకలను నిర్వహించారు. తన మేనకోడళ్లతో కలిసి వచ్చిన నటుడు రాంచరణ్.. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
ఎందరో మహానుభావుల త్యాగం వల్లనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని రాంచరణ్ కొనియాడారు. వేడుకల్లో నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు చిరంజీవి రక్తనిధి కేంద్రం నిర్వాహకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.