ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

14న సీఎం జగన్​తో చిరంజీవి భేటీ - త్వరలో జగన్ చిరంజీవి సమావేశం... ఎందుకంటే...?

ఏపీ సీఎం జగన్​తో మెగాస్టార్​ చిరంజీవి భేటీ కానున్నారు. ఇటీవలే విడుదలై విజయాన్ని అందుకున్న సైరా చిత్రంపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం.

చిరు

By

Published : Oct 11, 2019, 6:59 AM IST

కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో చిరంజీవి ఈ నెల14న ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డిని కలవనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి తన తనయుడు రామ్​చరణ్​తో కలిసి ఆయన వస్తారు. సైరా చిత్రాన్ని చూడాలని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. చిరంజీవి 151వ చిత్రంగా రామ్​చరణ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్​తో దూసుకుపోతోంది. ఇందులో మెగాస్టార్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details