CHIRU COMMENTS ON POLITICS : గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ సమావేశంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్ అంకితభావం కలిగిన నాయకుడని, అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో తన మద్దతు తప్పనిసరిగా పవన్‌కు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. సినిమాలో ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు వేసే విధంగా చేయలేదని ఆయన అన్నారు. మాతృకలో ఉన్న కథ ఆధారంగానే డైలాగులు రాశారని.. అవి విని ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేనని తెలిపారు.
భవిష్యత్‌లో నా మద్దతు తమ్ముడు పవన్‌కు ఉంటుంది: చిరంజీవి - chiru interesting comments on pawan
14:11 October 04
అంకితభావం కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కు అవసరం: చిరంజీవి
ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించే అవకాశాన్ని తన సోదరుడు పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఇస్తారన్న విశ్వాసం ఉంది. భవిష్యత్‌లో తన మద్దతు పవన్‌కల్యాణ్‌కు ఉంటుంది. కల్యాణ్ నిబద్దత కలిగిన వ్యక్తి, అలాంటి నాయకుడు రావాలి. పవన్ కల్యాణ్‌ను మంచి నాయకుడిగా చూడటం కోసమే.. నేను రాజకీయాల్లో తటస్థంగా ఉన్నాను. -చిరంజీవి
మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సత్యదేవ్, నయనతార, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
ఇవీ చదవండి: