ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వివేకా హత్యకేసులో స్పందించకపోతే...సీఎంను అనుమానించాల్సి వస్తోంది' - Chinta Mohan latest news

వైఎస్ వివేకా హత్య కేసుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని తిరుపతి లోక్​సభ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ డిమాండ్ చేశారు. 24 గంటల్లో స్పందించకపోతే సీఎంపై అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుందని అన్నారు.

chintha mohan
తిరుపతిలో చింతామోహన్ ఎన్నికల ప్రచారం

By

Published : Apr 3, 2021, 4:29 PM IST

తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ మీడియా సమావేశం

వైఎస్ వివేకా హత్య కేసుపై 24గంటల్లో సమాధానం చెప్పకపోతే సీఎం జగన్​పై అనుమానపడాల్సి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి లోక్​సభ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా..ఎం.ఆర్ పల్లి, ఎయిర్ బైపాస్ రోడ్ ప్రాంతాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ వివేకా హత్య.. రాజకీయ హత్యేనని ఆయన కుమార్తె దిల్లీ మీడియా మందు చెప్పిందన్న ఆమె వ్యాఖ్యలకు బాధ కలిగిందన్నారు చింతా మోహన్​.

వివేకా హత్యపై సీఎం జగన్ వద్ద నిఘా నివేదికలు ఉన్నాయన్న చింతా మోహన్... వివేకా కుమార్తెకి జగన్ 24గంటల్లో కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలన్నారు. ప్రధాని మోదీ సైతం ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details