కరోనా సమయంలో ప్రజలకు ఉపయోగపడే ప్రతీ అంశాన్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని త్రిదండి చినజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. డీన్ శ్రీనివాస ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలు బావున్నాయని అభినందించారు.
ఆనందయ్య ఔషధంపై వివాదమెందుకు..?- చినజీయర్ స్వామి - ఆనందయ్య న్యూస్
హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిని చినజీయర్ స్వామి సందర్శించారు. ఆస్పత్రిలోని వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆనందయ్య మందుపై చినజీయర్ స్వామి స్పందించారు.
chinajeeyar
ఆనందయ్య ఇస్తున్న మందులో ఇప్పటివరకు ఎవరికి ప్రమాదం కలగలేదని చినజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు ఆనందయ్య మందును ప్రజలకు అందించడంలో ప్రభుత్వాలకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కరోనా నుంచి కొలుకునేందుకు మనోధైర్యమే పెద్ద మందని చినజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 2 years for ycp: జేసీబీ, ఏసీబీ, పీసీబీ.. టాగ్ లైన్ సీఐడీ: అచ్చెన్నాయుడు
Last Updated : May 30, 2021, 8:57 PM IST